: ఇప్పటికే ఇష్టమొచ్చినట్టు బాదుతున్న ఎస్బీఐ... ఇక ఖాతా రద్దు చేసినా జరిమానా!

ఇప్పటికే మినిమమ్ బ్యాలెన్స్ అంటూ కస్టమర్ల నెత్తిన బండలేసి, ఖాతాల్లో మొత్తం తగ్గిందంటూ, ఎడాపెడా జరిమానాలు విధిస్తూ, అందరితో విమర్శలకు గురవుతున్న ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. బ్యాంకులో ఖాతాను వద్దనుకునే వారు, దాన్ని రద్దు చేసుకునే పక్షంలో సేవింగ్స్ ఖాతా అయితే, రూ. 575, కరెంట్ ఖాతా అయితే రూ. 1000 జరిమానా విధిస్తోంది. దీంతో ఖాతాదారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది.

మెట్రోల్లో రూ. 5 వేలు, నగరాల్లో రూ. 3 వేలు, పట్టణాల్లో రూ. 2 వేలు, గ్రామాల్లో కనీసం రూ. 1000 ఖాతాలో ఉంచాల్సిందేనని బ్యాంకు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాలను నిర్వహించలేమని, తమకు ఖాతాలు వద్దని చెబుతూ, రద్దు చేసుకునేందుకు వెళ్లిన కస్టమర్లపై ఇప్పుడు బాదుడు షురూ చేసిన బ్యాంకు వైఖరిపై ఇప్పుడు మరిన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News