: టీమిండియా కొత్త గోడ పడిపోయింది...కరుణ్ నాయర్ కూడా నిలవలేదు

టీమిండియా నయా వాల్ పడిపోయింది. ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో కొత్తగోడ (నయా వాల్) గా పేరొందిన ఛటేశ్వర్ పుజారా అవుటయ్యాడు. రెండో సెషన్ వరకు కుదురుగా ఆడిన పుజారా..మూడో సెషన్ ప్రారంభమైన తొలి ఓవర్ లోనే పుజరాను లియాన్ పెవిలియన్ కు పంపి బ్రేక్ ఇచ్చాడు. టీమిండియా వికెట్ల పతనాన్ని అడ్డుకుని నిలకడగా ఆడుతూ పుజారా అర్థ సెంచరీ సాధించాడు. అనంతరం రెండో సెషన్ ముగియడంతో బ్యాటింగ్ కు దిగిన పుజారా (57) తొలి ఐదు బంతులు సమర్థవంతంగా అడ్డుకున్నాడు. చివరి బంతిని అడ్డుకునే క్రమంలో హ్యాండ్స్ కొంబ్ కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం వచ్చిన ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్ (5) క్రీజులో కుదురుకోలేకపోయాడు. దీంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దీంతో రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి దిగాడు. దీంతో టీమిండియా 65 ఓవర్లలో 167 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. 

More Telugu News