demonitisation: పెద్దనోట్ల రద్దు తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం: టాటామోటార్స్‌

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద నోట్ల నిర్ణ‌యం త‌రువాత ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే చ‌క్క‌బ‌డుతున్నాయి. ఈ అంశంపై దేశీయ వాహన తయారీ సంస్థ టాటామోటార్స్ స్పందిస్తూ త‌మ సంస్థ తిరిగి కోలుకుంటోంద‌ని చెప్పింది. పెద్ద‌నోట్ల ర‌ద్దు అనంత‌రం గ‌త ఏడాది డిసెంబర్‌ మధ్య నుంచి త‌మ కంపెనీ వాహన విక్రయాలు నెమ్మదిగా పెరిగాయ‌ని పేర్కొంది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం వాహన విక్రయాలపై ప్రభావం చూపిందని తెలిపింది. మొత్తం ప‌రిశ్ర‌మ‌పైనే ఈ ప్ర‌భావం ప‌డింద‌ని టాటా మోటార్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఎండీ బట్స్‌చెక్‌ తెలిపారు.

More Telugu News