panner selvam: రేపు అమరావతికి పన్నీర్ సెల్వం.... చంద్రబాబుతో భేటీ కానున్న తమిళనాడు సీఎం

షార్ట్స్‌లో చూడండి
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రేపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌వ్య‌రాజ‌ధాని అమ‌రావ‌తికి రానున్నారు. అక్క‌డి నూత‌న సచివాల‌య ప్రాంగ‌ణంలో ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడితో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్ర‌ధానంగా చెన్నై తాగునీటి అవసరాలకు గానూ కృష్ణా జలాలను విడుదల చేయాలని చంద్ర‌బాబుని కోర‌నున్నారు. ఇదే అంశంపై చంద్ర‌బాబుకి ఇటీవ‌లే ప‌న్నీర్ సెల్వం ఓ లేఖ కూడా రాసిన విష‌యం తెలిసిందే. తెలుగుగంగ పథకం కింద ఈ నీరు వ‌ద‌లాల‌ని, ఆ జ‌లాలను కండలేరు జలాశయానికి విడుదల చేయాలని ప‌న్నీర్ సెల్వం కోరారు.

Go Back to Shorts
panner selvam

More Telugu News