ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎస్‌బీటీ

Fri, Dec 30, 2016, 01:38 PM
వడ్డీరేట్లపై ఏకంగా 25-30 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్న‌ట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్(ఎస్‌బీటీ) త‌మ‌ ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. స‌ద‌రు బ్యాంకు ప్ర‌క‌టించిన ఈ ఆఫ‌ర్ ప్ర‌కారం.. సగటు ఎంఎల్ఆర్ 8.6 శాతంగా ఉండ‌నుంది. ఒక నెలకు 8.80 శాతం, మూడు నెలలకు 8.90 శాతం, ఆరు మాసాలకు 9.05 శాతం ఈ వ‌డ్డీ రేటు ఉంటుంది. ఇక‌ వార్షిక రేటును 9.20 శాతం , రెండేళ్ల రేటు 9.25 శాతం మూడేళ్ల వ‌డ్డీరేటు 9.30 శాతంగా ఉండ‌నుంది. ఎల్లుండి నుంచే ఈ  తగ్గింపు  రేట్లు అమల్లోకి రానున్నాయి. దీనిపై స్పందించిన బ్యాంకుల కార్యనిర్వాహక బోర్డు ఎస్సెట్స్ అండ్ లయబిలిటీ ఇదో మంచి సంకేతమ‌ని పేర్కొంది. అలాగే ఎస్‌బీఐ కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించింది.
Tags: Sbt Offer
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement