stalin dmk: మాజీ సీఎస్ రామ్మోహనరావు చేసిన ప్రకటనపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి : స్టాలిన్

తమిళనాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు ఇంట్లో సోదాలు చేప‌ట్టిన అధికారులు ఆయ‌న వ‌ద్ద నుంచి భారీ ఎత్తున న‌గ‌దు, బంగారం స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న ప‌ద‌విని పోగొట్టుకున్న రామ్మోహ‌న‌రావు ఈ రోజు మాట్లాడుతూ.. ఇప్ప‌టికీ త‌మిళ‌నాడుకు తానే సీఎస్ న‌ని, కేంద్ర స‌ర్కారుపై కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పట్ల‌ డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ స్పందించారు. రా‌మ్మోహ‌న‌రావు చేసిన వ్యాఖ్య‌ల‌పై ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వివరణ ఇవ్వాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

అంతేగాక‌, రామ్మోహనరావు చేసిన ఆరోపణలకు కేంద్ర స‌ర్కారు కూడా స‌మాధానం చెప్పాల‌ని స్టాలిన్ అన్నారు. సచివాలయంలో ఆదాయ‌ప‌న్ను శాఖ జ‌రిపిన త‌నిఖీల‌ను తాను కూడా ఖండించానని, అయితే, ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మాత్రం స్పందించ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. ఈ వ్యవహారంలో బీజేపి ప్రమేయం ఉందో లేదో ఆ పార్టీ నేతలు తెల‌పాల్సిందేన‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

More Telugu News