ఢిల్లీ మెట్రో రైళ్లలో మహిళా జేబుదొంగల జోరు.. 438 మంది పట్టుబడిన వైనం!
కొన్నేళ్ల నుంచి జేబు దొంగతనాలకు పాల్పడుతున్న మహిళల సంఖ్య పెరుగుతూనే ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ మహిళలు ప్రయాణికులకి అనుమానం రాకుండా పిల్లవాడిని చంకలో పెట్టుకొని మరీ ప్రయాణికుల జేబుల్లో చేతులు పెట్టేస్తున్నారట. మరికొంత మంది మహిళలు గుంపుగా వెళ్లి ప్రయాణికుల పర్సులు కొట్టేస్తున్నారట. దొంగలను పట్టుకోవడానికి సీఐఎస్‌ఎఫ్ పోలీసులు సాధారణ దుస్తుల్లో రైళ్లలోకి ప్రవేశించి తనిఖీలు నిర్వహించారు.