chandrababu: పోలవరం ప్రాజెక్టుపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం: అరుణ్‌జైట్లీ

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు పోలవ‌రం తొలిద‌శ ప‌నుల నిధుల‌కు సంబంధించిన చెక్కును కేంద్ర మంత్రులు ఉమాభార‌తి, అరుణ్‌జైట్లీ, వెంక‌య్య‌నాయుడుల చేతుల మీదుగా అందుకున్నారు. అనంత‌రం అరుణ్‌జైట్లీ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టుపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామ‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి అన్ని ర‌కాల సాయం అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్రాజెక్టు ప‌నులు వేగంగా పూర్తి కావాలంటే నిధులు అవ‌స‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. నాబార్డు ద్వారా ఈ నిధులు అందిస్తున్న‌ట్లు తెలిపారు.
Go Back to Shorts
chandrababu
polavaram
arunjaitly

More Telugu News