manohar parrikar: వెయ్యికాపీలు కూడా అమ్ముడుపోని పత్రిక ఇలాంటి రాతలు రాస్తోంది!: మనోహర్ పారికర్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఉత్తర గోవాలోని సత్తారి సబ్‌ జిల్లాలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన ర‌క్ష‌ణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌చారం కోసం అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేయకూడ‌ద‌ని  గోవా మీడియాలోని ఓ వర్గంపై ఆయన మండిప‌డ్డారు. అలా ప్రచారం చేసుకోవ‌డం కంటే  సదరు మీడియా దుస్తులిప్పి నగ్నంగా డ్యాన్స్‌ చేయడమే న‌య‌మ‌ని అన్నారు. తన పరిమితులను గురించి మ‌ర్చిపోతున్న ఆ మీడియా ఏవేవో వాగుతోంద‌ని వ్యాఖ్యానించారు.

1968లో వాటర్‌గేట్‌ కుంభకోణం సందర్భంగా ఒక ఎడిటర్‌ రిచర్డ్‌ నిక్సన్‌కు (నాటి అమెరికా అధ్యక్షుడు)  ప‌లు విష‌యాలపై సలహాలు ఇస్తూ ఓ సంపాదకీయం రాశార‌ని, అది త‌న‌కు ఇప్పటికీ గుర్తుందని పారిక‌ర్ అన్నారు. ఇప్పుడు అదే నిక్సన్‌ కోసం మరాఠీలో సంపాదకీయాలు రాస్తామంటే ఎలా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అతను అమెరికన్ క‌దా? అని అన్నారు. కొందరు వ్యక్తులు తమ పరిమితులను గుర్తించకుండా గంద‌ర‌గోళం సృష్టిస్తున్నార‌ని ఆరోపిస్తూ స్థానిక దినపత్రికపై పారిక‌ర్ నిప్పులు చెరిగారు. స‌ద‌రు ప‌త్రిక‌వి మార్కెట్లో వెయ్యికాపీలు కూడా అమ్ముడుపోవ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. అటువంటి ప‌త్రిక ప‌బ్లిసిటీ కోసం ఇటువంటి రాత‌లు రాస్తోంద‌ని అన్నారు.

More Telugu News