help for chennai: కష్టాల్లో చెన్నైవాసులు ... ఆదుకునే వారెవరు?

వార్దా తుపాను ధాటికి చెన్నై మహానగరం వణికిపోయిన సంగతి తెలిసిందే. ఎటు చూసినా విధ్వంసమే కనిపించింది. భారీ గాలులు నగరాన్ని అతలాకుతలం చేసేశాయి. పెద్దపెద్ద చెట్లు సైతం కూలిపోయాయి. ఈ ప్రమాదంలో పలు కార్లు, ఆటోలు, బైకులు ధ్వంసమయ్యాయి. చెన్నైని గతంలో వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. చిరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా, ఆకాశానికి చిల్లుపడిందా? అన్న రీతిలో ధారాపాతంగా వర్షం కురిసింది. నగరం మొత్తం మునిగిపోయింది. జంతువులు కూడా ఇళ్లలోకి వచ్చేశాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా చెన్నైవాసులు మనోనిబ్బరం ప్రదర్శించారు. వారికి అన్నివైపుల నుంచి సాయం అందింది.

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి సాయం అందింది. స్వచ్ఛంద సంస్థలు, మనసున్న మారాజులు సాయం అదించారు. ఇప్పుడు పరిస్థితులు అలా సాయం చేయడానికి సహకరించడం లేదు. పాలు, పళ్లు ఏం కొనాలన్నా డబ్బులు లేవు. చేతిలో చిల్లిగవ్వ ఆడకపోవడంతో చెన్నైని ఆదుకునేందుకు ముందుకు రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చెన్నైవాసుల కష్టాన్ని పంచుకునేందుకు, నష్టాన్ని భర్తీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. దీంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు, యువకులు మాత్రం ముందుకు వెళ్లి, రోడ్లు, ఇళ్లకు అడ్డంగా పడిన చెట్లను తొలగించడంలో నిమగ్నమవుతున్నారు. 

More Telugu News