dieting: తరచూ డైటింగ్ చేస్తున్నారా.. జాగ్రత్త.. మీరు లావయ్యే ప్రమాదం ఉందట!

డైటింగ్ చేస్తే సన్నబడతారనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే చాలా మంది పదేపదే డైటింగ్ చేస్తూ బరువు తగ్గే ప్రయత్నాన్ని చేస్తుంటారు. అయితే ఇలా తరచు డైటింగ్ చేసేవారు బరువు తగ్గడం సంగతి అటుంచితే, బరువు పెరుగుతారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు కొన్ని జంతువులపై పరిశోధనలు చేసినట్టు పరిశోధకులు తెలిపారు. డైటింగ్ చేసేవారు తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తింటారన్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే, డైటింగ్ ముగిసిన అనంతరం వారు బాగా తింటారు. అందువల్ల వీరి శరీరాకృతి అదుపు తప్పుతుంటుంది. డైటింగ్‌ అసలు చేయని వాళ్లు శరీరానికి సరిపడినంత ఆహారం తీసుకుంటారు కాబట్టి, ఎక్కువ ఫ్యాట్‌ ను వారు శరీరంలో స్టోర్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని, దీంతో వారి మెదడు ఆహారానికి సంబంధించి ఎలాంటి సంకేతాలు పంపదని, అదే డైటింగ్ తరచు చేసేవారి మైండ్ మాత్రం కొవ్వును నిల్వ చేసుకోవాలనే సంకేతాలు పంపుతుందని ఈ పరిశోధన తెలిపింది.

 ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే, డైటింగ్‌ చేయని వారి కన్నా డైటింగ్‌ చేసేవాళ్ల సగటు బరువు ఎక్కువగా ఉంటోందిట. దీనికి కారణం మొదట చెప్పుకున్నట్టు డైటింగ్‌ చేయనివారు శరీరానికి కావాల్సినంత ఆహారం తీసుకోవడం వల్ల వారికి ఎక్కువ ఫ్యాట్‌ నిల్వలు అవసరం లేదని, డైటింగ్ చేసేవారి శరీరంలో ఫ్యాట్ నిల్వ ఉంటుందని, దీంతో వారు బరువు ఎక్కువ కనిపిస్తారని పరిశోధకులు తెలిపారు. ఈ విషయం జంతువులపై చేసిన పరిశోధనల్లో తేలిందని అన్నారు. అలాగే డైటింగ్ చేసేవారిలో ఎక్కువ తినాలనే కోరిక ఉంటుందని వారు తెలిపారు. శరీరానికి అవసరమైన ఫ్యాట్ నిల్వ చేసుకోవచ్చని సంకేతాలు విడుదల చేస్తుందని, అసలు డైటింగ్ చేయని వారికి అలాంటి సంకేతాలు పంపవని పరిశోధకులు తెలిపారు. దీంతో డైటింగ్ కంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తే బరువు, లావు తగ్గవచ్చని పరిశోధకులు తెలిపారు. 

More Telugu News