: బ్యాంకింగ్, ఆటో దెబ్బకు కుదేలైన మార్కెట్లు!

భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో సెక్టార్ల స్టాకులు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో మార్కెట్లు పతనమయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 385 పాయింట్లు నష్టపోయి 25,765కు పడిపోయింది. నిఫ్టీ 145 పాయింట్లు కోల్పోయి 7,929కి చేరింది. బ్లూ చిప్ కంపెనీలైన ఎస్బీఐ 6.51 శాతం, టాటా మోటార్స్ 2.99 శాతం పతనమయ్యాయి. ఇవాల్టి టాప్ గెయినర్స్... ఇన్ఫో ఎడ్జ్ (4.96%), టోరెంట్ పవర్ (2.46%), భారతి ఇన్ ఫ్రా టెల్ (2.12%), రెప్కో హోమ్ ఫైనాన్స్ (2.11%), ఈ క్లర్క్స్ సర్వీసెస్ (2.03%). టాప్ లూజర్స్... సెంచురీ టెక్స్ టైల్స్ (-9.03%), ఇండియా సిమెంట్స్ (-9.02%), కార్పొరేషన్ బ్యాంక్ (-8.83%), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (-8.82%), నాట్కో ఫార్మా (-8.75%).

More Telugu News