: రిలయన్స్‌ అధినేతకు 10,312 కోట్ల రూపాయ‌ల జరిమాన విధించిన కేంద్ర ప్రభుత్వం

రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీ పెద్ద మొత్తంలో పరిహారం కట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఓఎన్‌జీసీ-రిలయెన్స్ సంస్థల‌కు చెందిన కేజీ- డీ 6 బ్లాక్ పై కొంత‌కాలంగా గ్యాస్ వివాదం చెల‌రేగుతోంది. కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లో రిల‌య‌న్స్‌కు చెందిన బావుల పక్కనే ఉన్న ఓఎన్‌జీసీ బావుల నుంచి గ్యాస్‌ను తోడేయడం ప‌ట్ల 1.55 బిలియన్ డాలర్లు( దాదాపు 10,312 కోట్ల రూపాయ‌లు) జరిమానా క‌ట్టాల‌ని కేంద్ర స‌ర్కారు పేర్కొంది. ఈ అంశంపై విచార‌ణ జ‌రిపిన భార‌త‌ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్.. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీ ఉత్ప‌త్తి చేసిన ఓఎన్‌జీసీ గ్యాస్ విలువ గురించి తెలుపుతూ 1 బిలియన్ డాల‌ర్లు (దాదాపు రూ. ​6652.75 కోట్లు) గా పేర్కొంది. అనంత‌రం త‌న నివేదిక‌ను ప్ర‌భుత్వానికి ఇచ్చింది. దీంతో పై విధంగా కేంద్రం ప‌రిహారం చెల్లించాల‌ని ఆదేశించింది.

More Telugu News