: రూ. 1,124 కోట్ల నుంచి సున్నాకు... నాడు పల్లోంజీకి మూడేళ్లు డెడ్ లైన్ పెట్టిన టాటా!

ముంబైలోని ప్రతిష్ఠాత్మక తాజ్ మహల్ హోటల్, గుజరాత్, సనంద్ లోని టాటా నానో ప్లాంటు, పుణెలోని హింజెవాడీ ప్రాంతంలోని టీసీఎస్ క్యాంపస్... ఇవన్నీ టాటా గ్రూప్ లో భాగమే. ఇంకా ముఖ్యంగా వీటిల్లో ఉన్న మరో కామన్ అంశం... వీటిని షాపూర్ జీ పల్లోంజీ సంస్థలు నిర్మించాయి. టాటాలకు భవనాలు కట్టించి ఇస్తూ, ఆ మేరకు టాటా కంపెనీల్లో వాటాలను పెంచుకుంటూ రాగా, 2012-13లో అది రూ. 1,124 కోట్లకు చేరుకుంది. పల్లోంజీ గ్రూపునకు చెందిన సైరస్ మిస్త్రీ డిసెంబర్ 2012లో టాటా సన్స్ చైర్మన్ గా ఎంపికైన తరువాత, మూడేళ్లలో అంటే 2015-16 ముగిసేలోగా, ఆ మొత్తం వాటాను సున్నాకు చేర్చాలని, సైరస్ హయాంలో పల్లోంజీ గ్రూప్ కు ఎలాంటి భవనాల నిర్మాణ బాధ్యతలనూ ఇవ్వరాదని రతన్ టాటా ఆదేశించారు. ఆ ఆదేశాల్లో భాగంగానే పల్లోంజీ గ్రూప్ తన వాటాను నిదానంగా తగ్గించుకుంటూ వచ్చింది. ఆపై గత నెలలో సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన నేపథ్యంలో, గ్రూపు సంస్థల్లో పల్లోంజీకి ఒక్క రూపాయి విలువైన వాటా కూడా ఉండరాదని భావిస్తున్న రతన్ టాటా, పల్లోంజీల వాటాను కొనుగోలు చేసే వ్యూహాత్మక భాగస్వామిని గుర్తించే పనిలో పడ్డారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News