: గురుగ్ర‌హ చంద్రుడిపై నీరు ఎగిసిప‌డుతోందట.. మ‌నుషులకు నివాస‌యోగ్య‌మైన ప్రాంతమని తేల్చిన నాసా

గురు గ్రహానికి చెందిన చంద్రుడు ‘యురోపా’పై ప‌రిశోధ‌న‌లు కొన‌సాగిస్తోన్న నాసా శాస్త్ర‌వేత్త‌లు మ‌రో విష‌యాన్ని క‌నుగొన్నారు. యురోపాపై నీటి ఆవిరి ఎగిసిప‌డుతున్న‌ట్లు గుర్తించారు. విశ్వంలో భూమిలాగే మనుషులకు నివాస‌యోగ్యంగా ఉండే ప్రాంతంగా యురోపాను వారు భావిస్తున్నారు. భూమికి ఉన్న చంద్రుడు ఏ ప‌రిమాణంలో ఉంటాడో అంతే ప‌రిమాణంలో యురోపా ఉన్న‌ట్లు వారు వెల్ల‌డించారు. తాము హ‌బుల్ టెలిస్కోప్ ఆధారంగా ఈ అంశాన్ని క‌నుగొన్న‌ట్లు చెప్పారు. జ‌ల‌పాతంలా ప‌డుతున్న ఈ నీటి ఆవిరి సుమారు 200 కిలోమీట‌ర్ల ఎత్తుకు ఎగిసిప‌డుతూ వుందని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు. అక్కడ స‌ముద్రం కూడా ఉంద‌ని, దాని వ‌ల్లే అక్క‌డ ప్రాణుల నివాస‌యోగ్యానికి అనుకూలంగా వాతావరణం ఉంటుంద‌ని నాసా శాస్త్ర‌వేత్త జెఫ్ యార్డ‌ర్ పేర్కొన్నారు. భూమి కంటే రెట్టింపు నీటి ఆన‌వాళ్లు యురోపాపై ఉన్న‌ట్లు చెప్పారు. అయితే, ఘ‌నీభ‌వించిన మంచు కొండ‌ల కింద ఆ నీరు ఉంద‌ని వారు భావిస్తున్న‌ట్లు తెలిపారు. ఆ నీటిని సేక‌రించి అధ్య‌య‌నం చేస్తామ‌ని పేర్కొన్నారు.

More Telugu News