: ట్విట్టర్ ను కొనేందుకు గూగుల్, యాహూ పోటా పోటీ!

స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య పరంగా సోషల్ మీడియా యాప్ గా ఎదురులేని ట్విట్టర్ ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. సంస్థను అమ్మనున్నట్టు గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నా, వాణిజ్య ప్రకటనలు లేకపోవడంతో కోట్లాది రూపాయల నష్టాల్లోకి సంస్థ వెళ్లిపోయింది. దీంతో పలు కంపెనీలతో విక్రయం గురించి ట్విట్టర్ చర్చలు జరుపుతున్నట్టు, సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, గూగుల్ తో పాటు యాహూ కూడా ట్విట్టర్ ను సొంతం చేసుకునేందుకు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, యాహూను కొనుగోలు చేసిన వేరీజోన్ సంస్థలు ట్విట్టర్ కోసం తమ బిడ్లను దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఈ వార్తలు వచ్చిన తరువాత ట్విట్టర్ ఈక్విటీ విలువ ఏకంగా 19 శాతం పెరిగింది. మూడేళ్ల తరువాత సంస్థ ఈక్విటీ విలువ గరిష్ఠ వృద్ధిని చేరుకోగా, ఈ లెక్కల ప్రకారం, సంస్థ విలువ 16 బిలియన్ డాలర్లని నిపుణులు వెల్లడించారు.

More Telugu News