: 'మైండ్ ట్రీ'ని వీడుతున్న పెద్ద తలకాయలు... పాతాళానికి పడిపోయిన ఈక్విటీ!

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల సంస్థగా ఉన్న మైండ్ ట్రీలో ఉన్నతోద్యోగులు రాజీనామా చేయబోతున్నారని వచ్చిన వార్తల నేపథ్యంలో సంస్థ ఈక్విటీ విలువ పాతాళానికి పడిపోయింది. బెంగళూరు కేంద్రంగా మిడ్-టైర్ ఐటీ కంపెనీగా సేవలందిస్తున్న మైండ్ ట్రీలో వైస్ ప్రెసిడెంట్లుగా ఉన్న ఆర్.రాధా, ఆర్కే వీరరాఘవన్ లు రాజీనామా చేయనున్నారని ఎకనామిక్ టైమ్స్ లో ప్రత్యేక కథనం వచ్చింది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా, సంస్థ ఈక్విటీ విలువ 52 వారాల కనిష్ఠానికి దిగజారి రూ. 500కు పడిపోయింది. ఆర్.రాధా ప్రస్తుతం మైండ్ ట్రీ డిజిటల్ బిజినెస్ గ్రూప్ నకు అధిపతిగా ఉన్నారు. ఆయన డిజిటల్, మొబిలిటీ, డీఏఎస్, సాస్ ప్యాకేజీల సేవల బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంస్థ క్లయింట్లకు అందాల్సిన డిజైనింగ్, డెలివరీ సేవలను ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఇక వీరరాఘవన్ సంస్థలో గత 13 ఏళ్లుగా పనిచేస్తూ, ప్రస్తుతం టెక్నాలజీ విభాగానికి హెడ్ గా ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆదాయం గణనీయంగా తగ్గడం, మార్జిన్ల కోత తదితరాలు మైండ్ ట్రీని ఇబ్బందుల్లోకి నెట్టిన వేళ, ఉన్నతోద్యోగుల రాజీనామా వార్తలు రావడం గమనార్హం.

More Telugu News