: హోదాను పక్కనబెట్టడానికి అసలు కారణమిదే... తన అనుమానాన్ని బయటపెట్టిన ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదాను ఎందుకు ఇవ్వడం లేదన్న అంశంపై తన మనసులోని అనుమానాన్ని ఉండవల్లి బయట పెట్టారు. "దీని వెనుక ఓ పెద్ద విషయం ఉంది. అది నా అనుమానం మాత్రమే. నేను పర్సనల్ గా ఫీలయ్యేది ఏంటంటే... విభజన నాడు మోదీగారు లేరు. ఇప్పుడాయనకు ఓ సమస్య ఉంది. రాష్ట్రానికి ఉన్న పెద్ద అసెట్ ఏంటంటే, కేజీ బేసిన్. కేజీ బేసిన్ లో ఇంకా గ్యాస్ నిల్వలు, గుర్తించనివి చాలా ఉన్నాయి. వీటి విలువ వేల కోట్ల నుంచి లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇండస్ట్రీ అంతా కూడా... ఈ రిలయన్స్ అంతా కూడా గుజరాత్ తీరంలో ఉన్నాయి. ఇక్కడ గనుక స్పెషల్ కేటగిరీ స్టేటస్, నో ఎక్సైజ్ డ్యూటీ అంటే, వాళ్లందరూ వచ్చి ఇక్కడ పెడతారండీ. ఇక మోదీ రాష్ట్రంలో పరిశ్రమలు మిగలవు. కాకినాడ, వైజాగ్ కలిసిపోతాయి. ఈ ఐదేళ్లలో టాక్స్ ఎగ్జంప్షన్స్ తో ఓ 20 పర్సెంట్ లాభం పొందుతారు. కోటి రూపాయలు పెడితే ఓ 20 లక్షలు ఉట్టినే లాభం వస్తుంది. గుజరాతీ వాళ్లు పెద్ద వ్యాపారస్తులు. వారు ఆకర్షింపబడతారు. టక్ మని మొత్తం అందరూ ఇక్కడకు షిఫ్టయిపోతారు. అందుకని స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఆపేశారా? అన్నది నా పర్సనల్ సందేహం. నేను పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా పనిచేశాను కాబట్టి, ఇక్కడున్న నిల్వల విలువ తెలుసు. ఇదే మనకు పెద్ద అసెట్. రేపు రాబోయే రోజుల్లో వీటిని సరిగ్గా వాడుకోగలిగితే ఏపీకి తిరుగుండదు. ఈ అమరావతి, రాజధానిని కట్టక్కర్లేదండీ" అని ఉండవల్లి అన్నారు.

More Telugu News