: జేఎన్యూ విద్యార్థి సంఘాల ఎన్నికల్లో వామపక్షాల క్లీన్ స్వీప్

కన్నయ్య కుమార్ ఉదంతంతో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘాల ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ (ఎంఎల్) పార్టీల మద్దతుతో నిలిచిన యువకులు విజయం సాధించారు. నాలుగు పదవులూ వామపక్ష అభ్యర్థులకే దక్కాయి. బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల స్టూడెంట్ యూనియన్లు ఓడిపోయాయి. సీపీఐ (ఎంఎల్) ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, సీపీఎం అనుబంధ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అభ్యర్థులుగా పోటీపడ్డ మోహిత్ పాండే అధ్యక్షుడిగా, అమల్ వైస్ ప్రెసిడెంట్ గా, తాబ్రేజ్ హసన్ జాయింట్ సెక్రటరీగా, శతరూప చక్రవర్తి జనరల్ సెక్రటరీగా గెలిచారు. మొత్తం 59 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫలితాల విడుదల అనంతరం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విజేతలకు అభినందనలు తెలిపారు. దేశమంతా వర్శిటీ ఎన్నికలను నిశితంగా పరిశీంచిందని ఆయన గుర్తు చేశారు.

More Telugu News