: రూ.1,500 కోట్ల అవినీతి ఆరోపణల్లో హుడా!... హర్యానా మాజీ సీఎంపై ఈడీ కేసు!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడాపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణంలో పాత్ర ఉందంటూ ఇటీవలే సీబీఐ హుడా ఇళ్లలో సోదాలు చేసింది. తాజాగా నిన్న రంగంలోకి దిగిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై ఏకంగా మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. గుర్గావ్ పరిసరాల్లో జరిగిన అక్రమ దందాలో హుడా ఏకంగా రూ.1,500 కోట్లను వెనకేశారని సదరు కేసులో ఈడీ ఆయనపై అభియోగాలు మోపింది.

More Telugu News