: ఫేస్ బుక్ లో ఈ ఒక్క పని చేసి మీ స్నేహితుల ఒత్తిడిని తొలగించండి!

సాధారణంగా సోషల్ మీడియాలో స్నేహితులు పెట్టే పోస్టులను ఎక్కువ సందర్భాల్లో పెద్దగా పట్టించుకోకుండా మనకు నచ్చిన వాటికి, మనల్ని ఆకట్టుకున్న వాటికి మాత్రమే స్పందిస్తాం. అయితే ఇది సరైన విధానం కాదని... స్నేహితుల నుంచి వచ్చే ఫేస్‌ బుక్ కామెంట్లు ఆందోళనను దూరం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. బాగా అనుభంధమున్న స్నేహితుల నుంచి రోజుకు రెండు చొప్పున.. నెలకు 60 ఫేస్‌ బుక్ కామెంట్లు వస్తే జీవితంలోని ఆందోళనను దూరం చేయడంతోపాటు సంతృప్తినిస్తాయని పిట్స్ బర్గ్ లోని కార్నేగి మిల్లన్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. స్నేహితులు సోషల్ మీడియాలో పెట్టే పోస్టుకి ఒక లైక్, లేదా కామెంట్, అదీ కాకుంటే షేర్ ఇలా ఏం చేసినా ఆందోళన దూరమవుతుందని తమ అధ్యయనంలో తేలిందని వారు వెల్లడించారు. 91 దేశాల్లోని 1,910 ఫేస్‌ బుక్ యూజర్లపై పరిశోధకులు ఈ అధ్యయనం చేసినట్టు కంప్యూటర్ మీడియాటెడ్ కమ్యూనికేషన్ జర్నల్ ప్రచురించింది. అంతేకాకుండా, తెలిసిన వారితో ఫేస్ బుక్ మాధ్యమంగా మాట్లాడినా, లైక్ కొట్టినా కలిగే అనుభూతి నేరుగా వారిని కలిసిన అనుభూతితో సమానమని వారు వెల్లడించారు. దీంతో అంతవరకు ముసురుకున్న దిగులు, ఒంటరితనం, నిరాశా నిస్పృహలు దూరమై ఆనందం కలుగుతుందని వారు తెలిపారు. ఇలా చేయడం వల్ల మంచి కమ్యూనికేషన్ తో పాటు, మంచి మానవ సంబంధాలు ఏర్పడతాయని వారు వెల్లడించారు. కనుక ఇకపై సోషల్ మీడియాలో స్నేహితులు పెట్టే పోస్టుకి ఒక లైక్ లేదా కామెంట్ అదీ కాకపోతే షేర్ చేసి వారిని ఆనందంలో ముంచెత్తి...వాటిని అందుకుని మీరు కూడా ఆనందంలో మునిగితేలండి.

More Telugu News