: భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నాం.. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అమల్లోకి జీఎస్‌టీ: అరుణ్‌జైట్లీ

వచ్చే ఆర్థిక సంవత్స‌రం ప్రారంభం నుంచి వ‌స్తు సేవ‌ల ప‌న్ను(జీఎస్‌టీ) బిల్లును అమ‌ల్లోకి తీసురావ‌డానికి తాము ప్రయత్నాలన్నీ చేస్తున్న‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఢిల్లీలో జ‌రిగిన‌ ఎకనమిక్‌ ఇండియా సమిట్‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జైట్లీ మాట్లాడుతూ... తాము భారీ లక్ష్యాన్ని పెట్టుకున్న‌ట్లు చెప్పారు. ఇండియాకి క‌లిగే ఎన్నో ప్రయోజనాల దృష్ట్యా జీఎస్‌టీ బిల్లుకు ప‌చ్చ‌జెండా ఊపిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. బిల్లును రాష్ట్రాలు ఆమోదిస్తున్నాయ‌ని జైట్లీ అన్నారు. బిల్లుకు సంబంధించిన ప్ర‌క్రియ అంతా పూర్తి చేసి రాష్ట్రాల నుంచి వచ్చిన జీఎస్‌టీ బిల్లును రాష్ట్రపతి సంత‌కం కోసం పంపనున్న‌ట్లు చెప్పారు. ఈ ప్ర‌క్రియ‌కు నవంబర్‌ మధ్య వరకు మాత్రమే స‌మ‌యం ఉందని ఆయ‌న పేర్కొన్నారు. బిల్లుని అమ‌ల్లోకి తెచ్చే క్ర‌మంలో ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పారు.

More Telugu News