: వైఎస్ బాటలో రాహుల్ గాంధీ!... యూపీలో 2,500 కి.మీ.ల కిసాన్ యాత్రకు నేడే శ్రీకారం!

ఏపీలో పదేళ్ల చంద్రబాబు పాలనకు చరమ గీతం పాడేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఉమ్మడి ఏపీలో 1,467 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టిన వైఎస్... తదనంతరం అధికారంలోకి వచ్చారు. అంతేకాదు, పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంచారు. వైఎస్ నాటి పాదయాత్ర మాదిరే... ఉత్తరప్రదేశ్ లో 27 ఏళ్ల క్రితం చేజారిన అధికార పగ్గాలను చేజిక్కించుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా భారీ పాదయాత్రకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. ‘దియోరియా టూ ఢిల్లీ యాత్ర’ పేరిట నామకరణం చేసిన 2,500 కిలో మీటర్ల కిసాన్ పాదయాత్రను రాహుల్ గాంధీ నేడు ప్రారంభించనున్నారు. యూపీలోని పంచ్ లారీ క్రిత్ పురా గ్రామం నుంచి ప్రారంభం కానున్న సుదీర్ఘ పాదయాత్రలో రాహుల్ గాంధీ... తన మార్గంలో ప్రతి ఇంటినీ పలుకరిస్తూ ముందుకు సాగుతారు. యాత్రలో భాగంగా గడచిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమాల తరహాలో ‘ఖాప్ సభ’ల్లో రాహుల్ కీలక ప్రసంగాలు చేయనున్నారు.

More Telugu News