: ప్రతి అంశాన్ని రికార్డు చేస్తేనే కొలీజియం భేటీకి వస్తానంటున్న జస్టిస్ చలమేశ్వర్!

దేశ న్యాయ వ్యవస్థలో పై స్థాయి న్యాయమూర్తుల ఎంపిక, బదిలీలకు సంబంధించిన కొలీజియంలో సభ్యుడైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఇటీవల ఆ సమావేశానికి హాజరు కాని సంగతి విదితమే. ఈ విషయంపై నిన్న జాతీయ మీడియా సంస్థ ‘ఎన్డీటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కొలీజియంలో మరింత మేర పారదర్శకత పాటిస్తేనే తాను సమావేశానికి హాజరవుతానని ఆయన వ్యాఖ్యానించారు. కొలీజియం భేటీలో చర్చకు వచ్చిన ప్రతి అంశాన్ని మినిట్స్ బుక్ లో నమోదు చేస్తేనే పారదర్శకతకు పెద్ద పీట వేసినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తుల నియామకంతో పాటు ఆయా న్యాయమూర్తుల ఎంపికను తిరస్కరించడానికి గల కారణాలను కూడా మినిట్స్ బుక్కులో రాయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News