: అధికారికి రూ.3000 లంచమివ్వాలి... దానం చేయండి బాబూ!: బాలుడి వినూత్న నిరసన

ప్రభుత్వోద్యోగుల్లో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో తెలియజేసే ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఆ రాష్ట్రానికి చెందిన అజిత్ కుమార్ తండ్రి రైతు. గత ఏడాది ఫిబ్రవరిలో కిడ్నీ వ్యాధితో ఆయన మృతిచెందాడు. దీంతో ఆయనకు ప్రభుత్వం పరిహారం ఇస్తుందని, దాంతో కొన్ని కష్టాలు తీరుతాయని అజిత్ తల్లి భావించి, పరిహారం కోసం ఆమె అధికారుల చుట్టూ తిరుగుతోంది. వచ్చే పరిహారం 12,500 రూపాయలు కాగా, దీని కోసం దరఖాస్తు చేసే సమయంలో మూడు వేల రూపాయలు లంచంగా చెల్లించింది. దీంతో అధికారులు ఆమె కుటుంబానికి పరిహారం మంజూరు చేశారు. అయితే, ఈ మొత్తం వారికి అందాలంటే తనకు 3,000 రూపాయలు చెల్లించాలని వీఏవో ఎం.కున్నతూర్ వారికి స్పష్టం చేశాడు. దీంతో అజిత్ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడంతో అజిత్ కుమార్ వినూత్నంగా ఆలోచించి, వీఏవోకు 3,000 రూపాయలు లంచం ఇవ్వాలని, అలా ఇస్తే తమకు పరిహారంగా 12,500 రూపాయలు వస్తాయని పేర్కొంటూ ఓ బ్యానర్ తయారు చేసి భిక్షాటనకు కూర్చున్నాడు. దీంతో గ్రామస్తులంతా వీఏవో నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఉన్నతాధికారులకు చేరడంతో అతనిని విధుల నుంచి సస్పెండ్ చేసి, అజిత్ కుమార్ కుటుంబం ఖాతాలో డబ్బు జమచేశారు. దీంతో అజిత్ ను అభినందించారు.

More Telugu News