: నిర్లక్ష్యంగా వాహనాలను నడిపే వారిలో భయం కలిగించాలి... 'సెక్షన్ 304-ఏ'ను సవరించాలి: సుప్రీంకోర్టు

నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి ప్రజల మరణానికి కారకులయ్యే వారికి ప్రస్తుత చట్టాల ప్రకారం పడుతున్న రెండేళ్ల కారాగార శిక్ష చాలా తక్కువని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వాహనదారుల్లో చట్టంపై గౌరవం, శిక్షలపై భయాలు కలగడం లేదని, అందువల్లే వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, చట్ట సవరణ చేయాల్సిన సమయం ఆసన్నమైందని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సీ నాగప్పన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రతి నిత్యమూ వాహన ప్రమాదాల కారణంగా 400 మంది చనిపోతున్నారని వ్యాఖ్యానించిన న్యాయమూర్తులు, శిక్షలు గరిష్ఠంగా ఉంటే ప్రమాదాల సంఖ్య తగ్గవచ్చని పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్రం చట్ట సవరణ చేయలేకపోయిందని వెల్లడించిన కోర్టు, భారత శిక్షాస్మృతిలోని 'సెక్షన్ 304 ఏ'ను సవరించి అధిక శిక్షలను విధించేలా చూడాలని సూచించారు.

More Telugu News