: సల్మాన్ తో బంధంపై లులియా నోరు విప్పింది...కానీ పాతపాటే పాడింది

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ డేటింగ్ పై మీడియా వార్తలు రాయడమే తప్ప వాస్తవాలు బయటకు రాలేదు. సల్మాన్ వివాహంపై ఆయన తండ్రి సలీం 'అది దేవుడికే తెలియాలి' అని తేల్చేశారు. ఈ నేపథ్యంలో సల్మాన్ తో డేటింగ్ లో ఉన్న లులియా వంతూర్ మీడియాతో మాట్లాడింది. 'స్పై' మేగజీన్ తో ముచ్చటించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సల్మాన్ తాను మంచి స్నేహితులమని పాతపాటే పాడింది. 'తామిద్దరం డేటింగ్ చేయడం లేద'ని, 'స్నేహితులంటే స్నేహితులే'నని చెప్పింది. 'తమ మధ్య ఎలాంటి ప్రేమ లేద'ని చెప్పింది. 'కొన్ని మంచి సమయాల్లో మంచి పనులు జరుగుతుంటాయని, మిగిలినవన్నీ వదంతులే'నని చెప్పింది. దీంతో ఆమె చెప్పిన ఆ మంచి సమయమేదో, మంచి పనులేవో ఆరాతీయడంలో మీడియా మునిగిపోయింది. కాగా, సల్మాన్ తో లులియా వివిధ సందర్భాల్లో కనిపించడంతో వారి మధ్య డేటింగ్ జరుగుతోందని, రహస్యంగా వివాహం చేసుకుని ఉంటారని మీడియాలో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.

More Telugu News