: ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడరు?: వీహెచ్

ఏపీకి ప్రత్యేక హోదాపైన, తూర్పు కాపులను ‘బీసీ’ల్లో నుంచి తొలగించడంపైన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం చాలా సిగ్గుచేటని విమర్శించారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇటీవల పవన్ కల్యాణ్ తో భేటీ అయిన విషయాన్ని ప్రస్తావించిన సందర్భంలోనే వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముందు సొంత రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించుకునేందుకు పవన్ కృషి చేయాలని, ఆ తర్వాతే పక్క రాష్ట్రంలోని సమస్యలపై దృష్టిపెడితే బాగుంటుందని అన్నారు. అంతేకాకుండా, తెలంగాణ సీఎం కేసీఆర్ పై కూడా వీహెచ్ విమర్శలు గుప్పించారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కావాలని గతంలో కోరిన కేసీఆర్, ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరిట కాలయాపన చేయవద్దని వీహెచ్ అన్నారు.

More Telugu News