: ఒలింపిక్స్ విజేతలకు ఆయా దేశాల్లో అందే నజరానాల వివరాలు ఇవిగో!

ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు మన ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలు ఆయా ప్లేయర్లకు ప్రకటిస్తున్న నజరానాల విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాలకు చెందిన ఒలింపిక్ క్రీడా విజేతలకు ఆయా దేశాల్లో ప్రభుత్వాల నుంచి ఎటువంటి నజరానాలందుతాయనే విషయమై ప్రతి ఒక్కరిలోను ఆసక్తి నెలకొనడం సహజమే. ఆ వివరాల విషయానికొస్తే.. * తైవాన్ లో... స్వర్ణ పతక విజేతకు రూ.6.39 కోట్లు * కజకిస్తాన్ లో... స్వర్ణ పతక విజేతకు ట్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్, రజత పతక విజేతకు డబుల్ బెడ్ రూం ఫ్లాట్, కాంస్య పతక విజేతకు సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ * ఉక్రెయిన్ లో... రజత పతక విజేతకు రూ.57 లక్షల నగదు, ఒక ప్లాట్ తో పాటు ఎయిర్ రైఫిల్ * ఫ్రాన్స్ లో... మెడల్ సాధించిన విజేతలకు రూ.36 లక్షలు * చైనాలో... రూ.24 లక్షలు * అమెరికా, కెనడాల్లో... రూ.16 లక్షలు * జర్మనీలో... రూ.13 లక్షల వరకు బహుమతులు * రష్యాలో... ఒలింపిక్స్ పతకాలు సాధించిన వారికి ప్రభుత్వ పదవులు దక్కుతాయి. రూ. 44 లక్షల వరకు నగదు బహుమతులు * ఇటలీలో... రూ.1.14 కోట్లు * యూరప్ లోని పేద దేశం మోల్దోలో... రూ.88 లక్షల బహుమతి * ఇండోనేషియాలో... రూ.12 లక్షలు * నైజీరియాలో... రూ.1.34 లక్షలు * రుమేనియాలో... రూ. 53 లక్షలు * మలేషియాలో...నగదు బహుమతితో పాటు జీవితకాలం నెలకు రూ.80 వేలు చొప్పున ఇస్తారు * బ్రిటన్, నార్వే, స్వీడన్, క్రొయేషియాలో... ఎటువంటి నగదు బహుమతులివ్వరు. బ్రిటన్ లో అయితే, పతక విజేతల పేర్లను గౌరవనీయుల జాబితాలో చేరుస్తారు. కాగా, రియో ఒలింపిక్స్ లో ఒకేరోజు జరిగిన రెండు పోటీల్లో అమెరికాకు చెందిన దిగ్గజ స్విమ్మర్ ఫెల్ప్స్ ను ఓడించిన సింగపూర్ స్విమ్మర్ జోసఫ్ స్కూలింగ్ కు అక్కడి ప్రభుత్వం సుమారు రూ.5 కోట్ల నజరానాను ప్రకటించింది. మన దేశాన్ని మినహాయిస్తే ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ఒలింపిక్ విజేతలకు అందిన అతిపెద్ద నజరానా ఇదే!

More Telugu News