: ఢిల్లీ చేరిన దీపా కర్మాకర్!... మహిళా జిమ్నాస్ట్ కు ఘన స్వాగతం!

రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ లో సత్తా చాటిన దీపా కర్మాకర్ కొద్దిసేపటి క్రితం దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంది. జిమ్నాస్టిక్ చరిత్రలోనే భారత సత్తాను చాటి ఫైనల్స్ చేరిన దీపా... రియోలో అన్ని దేశాల క్రీడాకారులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఫైనల్స్ చేరిన దీపా నాలుగో స్థానంలో నిలిచి తృటితో పతకం చేజార్చుకుంది. అయితే ఆమె విన్యాసాలు మాత్రం జిమ్నాస్టిక్స్ లో భారత్ అద్భుతాలు సాధిస్తుందని తేల్చిచెప్పాయి. ఈ క్రమంలో ఆమె ప్రతిభపై ప్రశంసలు వెల్లువెత్తాయి. నేటి ఉదయం కోచ్ తో కలిసి ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన దీపాకు ఘన స్వాగతం లభించింది.

More Telugu News