: కశ్మీర్‌పై చర్చలా.. నో.. ఉగ్రవాదంపై చర్చలకు రెడీ: భారత్

కశ్మీర్‌పై చర్చించుకుందాం రమ్మంటూ పాక్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని భారత్ తిరస్కరించింది. కశ్మీర్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు ఉండవని తేల్చి చెప్పింది. ఉగ్రవాదంపై మాత్రం చర్చలు జరుపుదామని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ ఇస్లామాబాద్ వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతకుముందు కశ్మీర్ విషయంలో విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు జరుపుదాం రమ్మంటూ పాక్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి భారత్‌ను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని తోచిపుచ్చిన భారత్ సీమాంతర ఉగ్రవాదం, జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు గల కారణాలపై చర్చిద్దామంటూ ప్రతిపాదించింది. విదేశాంగ కార్యదర్శి జైశంకర్ ఇస్లామాబాద్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఓ ఆయుధంగా చేసుకుంటోందని, దౌత్య విధానంగా భావిస్తోందని ఆరోపించారు. కశ్మీర్‌పై పాకిస్థాన్ తనకు నచ్చినట్టు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు.

More Telugu News