: 'ఏక్ దిన్ కా సర్పంచ్' కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఇద్దరు బాలికలు

70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్యాణాలోని హిసార్‌ జిల్లా ధన్సు గ్రామ సర్పంచ్‌ మనోహర్‌ లాల్‌ భక్కర్‌ దేశానికి స్పూర్తిగా నిలిచే నిర్ణయం తీసుకున్నారు. ఆడపిల్లల్లో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు, మహిళా సాధికారత పట్ల అవగాహన కల్పించేందుకు 'ఏక్ దిన్ కా సర్పంచ్'గా గ్రామ పాఠశాలలో బాగా చదువుతున్న విద్యార్థినిని నియమించాలని నిర్ణయించారు. ఇందు కోసం ఇద్దరు విద్యార్థినులను పోటీపడుతున్నారు. ఇంటర్మీడియెట్‌ లో 81 శాతం మార్కులు తెచ్చుకున్న సుశీలా ఖతోర్‌, 87.2 శాతం మార్కులు తెచ్చుకున్న ఆర్తి మధ్య పోటీ నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థి సుశీల మాట్లాడుతూ, ఉన్నత విద్య కోసం గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్తున్న విద్యార్థులకు ప్రత్యేక బస్సులు కావాలని సర్కారుని కోరుతానని తెలిపింది. మనోహర్ లాల్ భక్కర్ నిర్ణయాన్ని అంతా ప్రశంసిస్తున్నారు.

More Telugu News