: జకీర్ నాయక్ అకౌంట్లో రూ.60 కోట్లు.. మూడేళ్లలో వెల్లువలా విదేశీ నిధులు

వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌కు విదేశాల నుంచి నిధులు వెల్లువెత్తాయి. మూడేళ్లలో ఏకంగా రూ.60 కోట్లు ఆయన బ్యాంకు అకౌంట్లో జమయ్యాయి. జకీర్ నాయక్ కేసును విచారిస్తున్న పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. మూడు వేర్వేరు దేశాల నుంచి జకీర్ నాయక్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న ఐదు అకౌంట్లలోకి మూడేళ్లలో రూ.60 కోట్లు వచ్చిపడినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. బ్యాంకు లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సొమ్ము జకీర్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్)కు సంబంధించినది కాదని తేలినట్టు చెప్పారు. ఈ విషయంలో ఐఆర్ఎఫ్ అధికారులను ప్రశ్నించనున్నట్టు అధికారి వివరించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

More Telugu News