: గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరన్నది రేపు తేలుస్తాం: విజయ్ రూపానీ

గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి ఆనందీ బెన్ పటేల్ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న రాజీనామా పత్రాన్ని ఆమె రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఓం ప్ర‌కాశ్ కోహ్లీకి కూడా అందించారు. అయితే, త‌దుప‌రి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎవ‌రిని నియ‌మిస్తుంద‌నే అంశంపైనే ఇప్పుడు రాజకీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది. గుజ‌రాత్‌ ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం కావడంతోపాటు ఆ అంశంపై బీజేపీ సుదీర్ఘంగా ఆలోచించి ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని చూస్తోంది. గుజ‌రాత్‌లో స‌మ‌ర్థ‌వంత‌మ‌యిన నాయ‌కుడిని ముఖ్య‌మంత్రిగా నియ‌మించాల‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరన్నది రేపు తేలుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి విజయ్ రూపానీ ఈరోజు మీడియాకు తెలిపారు. అమిత్ షాతో పాటు మరో ఇద్దరు అబ్జర్వర్లు రేపు భేటీ అయి తుది నిర్ణ‌యం తీసుకుంటార‌ని పేర్కొన్నారు.

More Telugu News