: సౌదీ అరేబియాలో కార్మికుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం: సుష్మాస్వరాజ్

సౌదీ అరేబియాలోని భారతీయ కార్మికుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. రాజ్యసభలో జీరో అవర్ చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్లా స్వయంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు రంగంలో దిగారని తెలిపారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో భారతీయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారని ఆమె చెప్పారు. అక్కడున్న కేంద్ర మంత్రి వీకే సింగ్ సౌదీ అరేబియా కార్మిక శాఖతో సమావేశం కాగా, తమ దేశంలో ఉన్న భారతీయులు స్వదేశం తరలాలనుకుంటే...వారికి ఎగ్జిట్ వీసా ఇచ్చి తమ విమానంలో పంపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అలా వెళ్లడానికి సిద్ధంగా లేకుండా, సౌదీ అరేబియాలోనే విధులు నిర్వర్తించాలని భావించే కార్మికులకు రియాద్ లోని పరిశ్రమల్లో విధులు నిర్వర్తించేలా దిశా నిర్దేశం చేశారని ఆమె చెప్పారు. అలాగే భారత్ నుంచి కార్మికులకు ఆహారం అందించడమేంటని ప్రశ్నించిన రాజు, భారతీయ కార్మికులందరికీ అక్కడే భోజన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారని తెలిపారు. సౌదీ అరేబియా ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాలు మర్చిపోలేమని అన్నారు. దీనంతటికీ కారణం ప్రధాని ఆదేశంతో నెరపిన సన్నిహిత సంబంధాలేనని, అందుకు ఆయనకు ధన్యవాదాలని ఆమె తెలిపారు.

More Telugu News