: నర్మదా నదిని ‘వేశ్య’గా అభివర్ణించిన మేధా పాట్కర్.. భగ్గుమన్న బీజేపీ

‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్ నర్మదా నదిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన పాట్కర్ పలు ప్రైవేటు కంపెనీలు నర్మదా నదిని వేశ్యలా ఉపయోగించుకుంటున్నాయని, ప్రతీ రోజు 172 కోట్ల లీటర్ల నీటిని తోడేస్తున్నాయని పేర్కొన్నారు. పవిత్ర నర్మదా నదిపై ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ నాయకులతోపాటు పలు ఎన్జీవోలు బర్వానీ పోలీస్ స్టేషన్‌లో ఆమెకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే కేసు నమోదు చేసేందుకు పోలీసులు అంగీకరించలేదు. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భోపాల్‌లోనే ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు. తనకు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తడంతో స్పందించిన మేధా పాట్కర్ తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఉద్దేశాన్ని గ్రహించలేదని పేర్కొన్నారు.

More Telugu News