: రికార్డు సృష్టించిన హిల్లరీ క్లింటన్!... అమెరికా అధ్యక్ష రేసులో నిలిచిన తొలి మహిళగా ఖ్యాతి!

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి, ఆ దేశ మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. అమెరికా అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమె ఖరారయ్యారు. ఈ మేరకు భారత కాలమానం ప్రకారం కొద్దిసేపటి క్రితం హిల్లరీని అధ్యక్ష ఎన్నికల బరిలోకి దించుతున్నట్లు డెమొక్రటిక్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన తొలి మహిళగా హిల్లరీ చరిత్ర సృష్టించారు. గడచిన కొన్ని నెలలుగా కొనసాగిన ప్రైమరీ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా టికెట్ కోసం హిల్లరీ హోరాహోరీ పోరు సాగించారు. అత్యధిక స్థానాల్లో మెజారిటీ సాధించిన హిల్లరీని డెమొక్రటిక్ పార్టీ తన అభ్యర్థిగా బరిలోకి దించక తప్పలేదు. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ఖరారైన డొనాల్డ్ ట్రంప్ పై విజయం సాధిస్తే... అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా హిల్లరీ మరో రికార్డును సొంతం చేసుకోనున్నారు.

More Telugu News