: రియో ఒలింపిక్స్... ఒక్కో క్రీడాకారుడికి 42 కండోమ్ లు ఇస్తారట!

వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్ కు బ్రెజిల్ నగరం ముస్తాబైంది. ఒలింపిక్ క్రీడాకారుల కోసం ‘ఒలింపిక్ గ్రామం’ అన్ని హంగులతో సిద్ధమైంది. 11 వేల మంది అథ్లెట్లు, 7 వేల మంది సిబ్బందికి వసతి కల్పించనున్నారు. క్రీడాకారులకు అన్ని సదుపాయాలతో పాటు కండోమ్ లను కూడా అందజేయనున్నారు. మొత్తం 4.50 లక్షల కండోమ్ లను తెప్పించారు. ఒక్కో క్రీడాకారుడికి 42 కండోమ్ ల చొప్పున ఇవ్వనున్నారని సమాచారం. జికా వైరస్ భయపెట్టిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని, అందుకే కండోమ్ లు సరఫరా చేస్తున్నారని సమాచారం.

More Telugu News