: టర్కీ తిరుగుబాటుదారులపై ప్రభుత్వ కర్కశత్వం!

టర్కీలో ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించి విఫలమై పోలీసులకు దొరికిపోయిన తిరుగుబాటుదారులపై ప్రభుత్వం అత్యంత కర్కశత్వాన్ని ప్రదర్శిస్తోందని, వారిని క్రూరంగా హింసిస్తోందని, మహిళలైతే సామూహిక అత్యాచారాలు చేయించి బాధపెడుతోందని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆమ్నెస్టీ సంచలన ప్రకటన చేసింది. మొత్తం 13 వేల మందికి పైగా ప్రభుత్వ వర్గాలు అదుపులోకి తీసుకోగా, వారిలో సైనికులతో పాటు వేల సంఖ్యలో న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీసు అధికారులు ఉన్నారు. వీరికి కనీస ఆహారం కూడా ఇవ్వకుండా నిత్యమూ ఇష్టానుసారం హింసిస్తున్నారని, ఇందుకు ఆధారాలు సంపాదించామని పేర్కొంది. కాగా, ఆమ్నెస్టీ ఆరోపణలను టర్కీ ప్రభుత్వం ఖండించింది. తామేమీ మానవ హక్కులను కాలరాసేలా అరెస్టయిన వారిని హింసించడం లేదని అధికారులు తెలిపారు. తాము ఈయూలో సభ్యత్వాన్ని పొందేందుకు గట్టిగా కృషి చేస్తున్నామని గుర్తు చేసిన ఓ అధికారి, ఈ తరహా అనుచిత చర్యలతో తమ అవకాశాన్ని క్లిష్టం చేసుకోబోమని పేర్కొన్నారు.

More Telugu News