: వెలుగులు విరజిమ్మని చందమామ ఎలా ఉంటుందో తెలుసా?

పండువెన్నెల్లో నిండు చందమామను చూస్తే వెండి వెలుగుల్లో అద్భుతంగా మెరిసిపోతూ మంచి అనుభూతిని అందిస్తాడు. మరి అలాంటి చందమామను అమావాస్య రోజున చూస్తే ఎలా ఉంటాడు? ఎప్పుడైనా ఈ అనుమానం వచ్చిందా? ఆ రోజున కూడా చంద్రుడు ఉంటాడు కానీ, మనకు కనిపించడు అంతే. ఇలా సూర్యుడి నుంచి ప్రసరించే వెలుగులు పడని క్షణాల్లో చంద్రుడు ఎలా ఉంటాడన్న దానిని నాసా చూపించింది. డీప్‌ స్పేస్‌ క్లైమేట్‌ అబ్జర్వేటరీ (డిస్కవర్‌) ఉపగ్రహం చీకట్లో ఉన్న చంద్రుడ్ని ఫోటో తీసింది. ఈ ఫోటోలో చంద్రుడు బూడిద రంగులో నిస్తేజంగా కనిపించాడు. ఈ ఫోటో ఈ జూలై 5న తీసింది. ఇలాంటి ఫోటోనే గతేడాది జూలై 16న కూడా మరోటి తీసింది. ఈ ఫోటోను నాసా అధికారిక వెబ్ సైట్ లో పెట్టింది.

More Telugu News