: ఇంటర్వ్యూకు వేళాయె!... కోచ్ పదవి కోసం ‘త్రయం’ ముందు క్యూ కట్టనున్న దిగ్గజ క్రికెటర్లు!

టీమిండియా కోచ్ గా ఎవరు నియమితులు కానున్నారు? మరో మడు రోజుల్లో ఈ విషయం తేలిపోనుంది. స్పిన్ బౌలింగ్ లో ప్రపంచంలోనే దిగ్గజంగా ఎదిగిన అనిల్ కుంబ్లేతో పాటు బ్యాటింగ్ లో సత్తా చాటి మేటి క్రికెటర్ గా గుర్తింపు పొందిన టీమిండియా జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, మరో మాజీ దిగ్గజం సందీప్ పాటిల్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో మాజీలు కోచ్ పదవి చేపడతామంటూ బీసీసీఐకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో మొత్తం 57 దరఖాస్తులను వడపోసిన బీసీసీఐ... 21 దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసింది. వీటిలో దిగ్గజాల దరఖాస్తులన్నీ ఉన్నాయి. ఈ దరఖాస్తులకు చెందిన క్రికెటర్లంతా నేడు ‘భారత దిగ్గజ త్రయం’ ముందు ఇంటర్వ్యూలకు హాజరు కానున్నారు. కోల్ కతాలోని ఓ హోటల్ లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లు ఇంటర్వ్యూలు చేయనున్నారు. ఇంటర్వ్యూలు పూర్తి చేసిన తర్వాత ఈ ‘త్రయం’ తమ నివేదికను బీసీసీఐకి సమర్పించనుంది. ఈ నివేదికను పరిశీలించే కమిటీ ఈ నెల 24న కోచ్ ను ప్రకటిస్తుంది.

More Telugu News