: అమెరికాలో నెల రోజుల వ్యవధిలో ఉద్యోగాలు పోగొట్టుకున్న లక్ష మంది టెక్కీలు!

గడచిన మే నెలలో అమెరికాలో ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న 96 వేల మందిని యాజమాన్యాలు ఉద్యోగాల నుంచి తొలగించాయని ఇండస్ట్రీ ట్రేడ్ బాడీ కాంప్ టీఐఏ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపుతో అమెరికాలో ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య 4.5 మిలియన్ డాలర్లకు తగ్గిందని వివరించింది. మేలో ఐటీ ఉద్యోగాల ట్రెండ్ నిరుత్సాహ పరిచిందని, దీని ఫలితంగానే నిరుద్యోగుల సంఖ్య 38 వేలు పెరిగిందని కాంప్ టీఐఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టిమ్ హెర్బర్ట్ వెల్లడించారు. ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలకు మే నెల కష్టకాలంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ ఆధారిత సంస్థలతో పోలిస్తే ఐటీ కంపెనీల్లో ప్రత్యక్ష ఉపాధిని పొందుతున్న వారు అధిక సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోయారని ఆయన వివరించారు. మొత్తం 15,500 మంది కంప్యూటర్ సిస్టమ్స్ ఇంజనీర్స్, 13,900 మంది సిస్టమ్ అనలిస్టులు, 13,700 మంది ఐటీ ప్రాజెక్టు మేనేజర్లు, 13,200 మంది సపోర్ట్ స్పెషలిస్టులు ఉద్యోగాలు కోల్పోయారని, ఇదే సమయంలో ఐటీ సేవల విభాగంలో 7,400 మంది విధుల్లో చేరారని హెర్బర్ట్ తెలిపారు.

More Telugu News