: అనుకున్నట్టుగానే... మారని పరపతి విధానం

విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు ఊహించినట్టుగానే నేటి పరపతి సమీక్షలో కీలక రేట్ల సవరణ తెరపైకి రాలేదు. ఈ ఉదయం పరపతి విధానాన్ని సమీక్షించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ రేపో రేటును ఇప్పుడున్న 6.5 శాతం వద్దే కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రేపో రేటు ఐదేళ్ల కనిష్ఠస్థాయిలో కొనసాగుతోందని గుర్తు చేసిన ఆయన, మార్చిలో 4.83 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఏప్రిల్ లో 5.39 శాతానికి చేరిందని తెలిపారు. ద్రవ్యోల్బణం కదలికలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. కమోడిటీ ధరల్లో ముఖ్యంగా క్రూడాయిల్ ధరల్లో శరవేగంగా మార్పు సంభవిస్తున్నందున చిల్లర ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్ ఇన్ ఫ్లేషన్) మరింతగా పెరుగుతుందని భావిస్తున్నామని, అందువల్లే ఈ సమయంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. మార్చి 2017 నాటికి రిటైల్ ఇన్ ఫ్లేషన్ ను 5 శాతానికి చేర్చాలన్న లక్ష్యానికి కట్టుబడి వున్నామని రాజన్ వివరించారు.

More Telugu News