: మహిళా ఎంపీపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ దురుసుతనం!

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ ఓ మహిళా నేతపై దురుసుగా ప్రవర్తించారని, ఆమె ఛాతీపై చేతులేసి గట్టిగా వెనక్కు నెట్టేశారని ఆరోపణలు రావడం కలకలం రేపింది. ట్రూడ్ తనతో దురుసుగా ప్రవర్తించారని, అత్యంత హేయమైన చర్యకు పాల్పడ్డారని పార్లమెంట్ సభ్యురాలు రుథ్ ఎల్లెన్ బ్రోస్సే ఆరోపణలు గుప్పించారు. ఇంత దారుణం ఎలా చేయగలిగారని ప్రశ్నించారు. కెనడా పార్లమెంటులో ట్రూడ్ తీసుకువచ్చిన సవరణలపై ఓటింగ్ సమయంలో ప్రారంభమైన వాదోపవాదాలు గొడవకు దారితీయగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఎల్లెన్ ఫిర్యాదుపై హౌస్ ఆఫ్ కామన్స్ సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించగా, ట్రూడ్ విపక్ష నేతలపై దాడి చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఓ బాక్సర్ గా, బౌన్సర్ గా సైతం పనిచేసిన జస్టిన్ ట్రూడ్ చేతి బలాన్ని చూపడంతో విపక్ష నేతలు వెనక్కు పడిపోయినట్టు వీడియోల్లో కనిపిస్తోంది. ఇక, తనపై ట్రూడ్ చేతులు వేశారని ఆరోపించిన ఎల్లెన్, షాక్ కు గురైన తాను ఓటుహక్కును కూడా వినియోగించుకోలేకపోయానని తెలిపారు. కాగా, ఈ ఘటనపై ట్రూడ్ వివరణ ఇస్తూ, ఎవరినీ బాధించాలన్న ఉద్దేశం తనకు లేదని చెప్పారు. క్షమాపణ కోరుతున్నానని అన్నారు.

More Telugu News