: సీన్‌ రివ‌ర్స్‌... కంగ‌నాపై నెటిజ‌న్ల అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు.. మండిపడ్డ హృతిక్

సీన్ రివ‌ర్స్ అయింది. మాజీ ప్రేమికులయిన బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ బ్రేక‌ప్ అయిన త‌రువాత‌ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి మ‌ధ్య ట్విట్టర్ వేదికగా సైలెంట్ యుద్ధం కూడా జ‌రిగింది. అయితే ఈ సారి ప‌లువురు నెటిజ‌న్లు కంగనా రనౌత్ ను విమ‌ర్శిస్తూ చేసిన ట్వీట్‌పై హృతిక్ రోష‌న్ స్పందించి, ఆమెపై అస‌భ్య‌క‌ర ట్వీట్‌లు చేయొద్దంటూ మండిప‌డ్డాడు. కంగనాది దిగజారుడు త‌న‌మ‌ని, ప‌బ్లిసిటీ కోస‌మే హృతిక్‌పై విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని, ఆమె క్యారెక్టర్ లెస్ వ్య‌క్తి అని సోష‌ల్ మీడియాలో ప‌లువురు ఆమెపై విమ‌ర్శ‌లు చేశారు. దీనిపై హృతిక్ రోష‌న్ స్పందిస్తూ... మంచి క్యారెక్ట‌ర్ లేని వారే మ‌రొక‌రి క్యారెక్ట‌ర్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. వీలైతే ప్రేమ‌ను పంచాలే కానీ, ఒక‌రి క్యారెక్ట‌ర్‌ను బ‌య‌ట‌పెడుతున్న‌ట్లు ట్వీట్లు చేయ‌డం మంచి చ‌ర్య కాద‌ని హృతిక్ ట్వీట్ చేశాడు.

More Telugu News