: మ‌రింత ముదురుతోంది... హృతిక్ రోషన్‌పై పోలీసుల‌కు 'క్వీన్‌' మ‌రో ఫిర్యాదు

మాజీ ప్రేమికులు హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మ‌ధ్య వివాదం ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా క‌న‌బ‌డ‌ట్లేదు. కొన్ని నెల‌లుగా నలుగుతున్న వీరి వివాదంలో పోలీసులకు మ‌రో ఫిర్యాదు అందింది. త‌న‌ అనుమతి లేకుండా తన వ్యక్తిగత ఈ-మెయిల్స్, ఫొటోలు హృతిక్ రోష‌న్ బయటపెడుతున్నారని కంగ‌నా ర‌నౌత్ ఫిర్యాదు చేసింది. ఈ విష‌య‌మై కంగనా తర‌ఫు న్యాయవాది ముంబై పోలీసు కమిషనర్ కు కంప్లైంట్ చేశారు. హృతిక్ రోష‌న్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. త‌మ మ‌ధ్య వివాదం వ‌చ్చిన అనంత‌రం ప‌ర‌స్ప‌రం నోటీసులు పంపించుకున్న హృతిక్‌, కంగనా ప్ర‌తీరోజు వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా కూడా ఇద్ద‌రి మ‌ధ్య యుద్ధ‌మే జ‌రిగింది.

More Telugu News