: నిరాశకు గురయ్యా!... అయినా వదలను!: ఫ్రీ బేసిక్స్ కు రెడ్ సిగ్నల్ పై ఫేస్ బుక్ చీఫ్

‘ఫ్రీ బేసిక్స్’ పేరిట భారత ఇంటర్నెట్ వినియోగదారులను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ చేసిన యత్నాలకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిన్న బ్రేకులేసేసింది. నెట్ న్యూట్రాలిటీకి పచ్చజెండా ఊపిన ట్రాయ్... ఫ్రీ బేసిక్స్ లాంటి వేర్వేరు టారిఫ్ ల ఇంటర్నెట్ కు ససేమిరా అంది. ఈ మేరకు స్పష్టమైన విధివిధానాలతో కూడా ఉత్తర్వులు నిన్న జారీ అయ్యాయి. ఇలా ట్రాయ్ నిర్ణయం వెలువడిందో, లేదో... అటు మార్క్ జుకెర్ బర్గ్ వేగంగా స్పందించారు. ట్రాయ్ నిర్ణయం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆయన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. అయినప్పటికీ, నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకునే విషయంలో రాజీ పడబోనని ఆయన ప్రకటించారు. బహుళ ప్రయోజనాలున్న ‘ఇంటర్నెట్. ఆర్గ్’ను ఒక్క భారత్ లోనే కాక విశ్వవ్యాప్తంగా ఆమోదం పొందేలా చేయడమే తన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.

More Telugu News