: స్మార్ట్ ఫోన్ల గురించి అందరూ నమ్మే అపోహలు, వాటి వెనకున్న వాస్తవాలు!

ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్, కనీసం మొబైల్ ఫోన్ సర్వసాధారణమై పోయింది. స్మార్ట్ ఫోన్ల గురించిన ఎన్నో విషయాలను మీరు బ్లాగ్ లు, ఈ-మెయిల్స్, వాట్స్ యాప్ మెసేజ్ లు, ఫేస్ బుక్ పోస్టుల ద్వారా తెలుసుకొని ఉంటారు. వాటన్నింటినీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. వాటిల్లో అత్యధికం అపోహలే. స్మార్ట్ ఫోన్ల గురించి అందరూ నమ్మే అపోహలు, వాటి వెనకున్న వాస్తవాలివి. అపోహ: విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు స్మార్ట్ ఫోన్లు వాడితే, కమ్యూనికేషన్, నావిగేషన్ వ్యవస్థలో లోపాలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతాయి. వాస్తవం: అధునాతన విమానాల్లో వాడే సమాచార వ్యవస్థకు, మొబైల్ ఫోన్ల తరంగాలకు ఎటువంటి సంబంధం లేదు. ఫోన్లు వాడినంత మాత్రాన ఫ్లయిట్ నావిగేషన్ లేదా కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎలాంటి ప్రమాదం ఉండదు. మొబైల్స్ తో వెయ్యో వంతు ప్రమాదం ఉందని భావించినా, ప్రయాణానికి ముందు మీరు వాటిని కచ్చితంగా డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా చెప్పాలంటే, మీరు మాట్లాడుతుంటే ఇతరులకు డిస్టర్బ్ జరగడం, పైలెట్లు, అటెండెంట్లు చేసే అనౌన్స్ మెంట్లకు అడ్డుపడొచ్చనే ఉద్దేశంతోనే ఫోన్స్ స్విచ్చాఫ్ ఏర్పాట్లు. అపోహ: పెట్రోలు పంపులు దగ్ధం కావడానికి మొబైల్ ఫోన్లు కారణం కావచ్చు. వాస్తవం: పెట్రోలుకు మండే గుణం ఎక్కువ. ఓ చిన్న నిప్పు రవ్వతో కూడా అది అంటుకుంటుంది. ఆ నిప్పురవ్వలు అగ్గి పుల్లలు, లైటర్లు వంటి వాటితో ఏర్పడతాయే తప్ప మొబైల్ ఫోన్ల నుంచి రావు. అయితే, మొబైల్ ఫోన్లలో ఉండే బ్యాటరీలు ఎప్పుడైనా పేలే ప్రమాదం ఉంటుంది కాబట్టి బంకుల్లో ఫోన్ వాడవద్దంటారు. సెల్ ఫోన్ల నుంచి నిప్పులు రావడం దాదాపు అసంభవమే. అపోహ: రాత్రంతా ఫోన్ చార్జింగ్ లో పెడితే, బ్యాటరీ త్వరగా పాడవుతుంది వాస్తవం: అన్ని అధునాతన ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో ఉండే రీచార్జబుల్ బ్యాటరీల్లో సేఫ్టీ సర్క్యూట్లు ఉంటాయి. ఇవి ఓవర్ చార్జింగ్ ను నిలువరిస్తాయి. ఒకసారి పూర్తిగా చార్జింగ్ అయిన తరువాత బ్యాటరీలకు విద్యుత్ ప్రసారం జరుగదు. అలా కాకుంటే, రోజుకు కొన్ని వేల సంఖ్యలో ఫోన్లు పేలిపోతున్న వార్తలు వినిపిస్తుండేవి సుమా! అపోహ: బ్యాటరీ పెద్దగా ఉంటే ఎక్కువ సమయం నిలుస్తుంది. వాస్తవం: అది సెల్ ఫోన్ కానివ్వండి, ల్యాప్ టాప్ కానివ్వండి, మరే ఇతర బ్యాటరీ ఆపరేటెడ్ ప్రొడక్టయినా, అది ఎంత బ్యాటరీని వాడుతుందన్న విషయంపైనే ఎంత సేపు నిలుస్తుందన్న విషయం ఆధారపడి వుంటుంది. ఇక ఫోన్ల విషయానికి వస్తే, బ్యాటరీ సైజు ఎంతున్నప్పటికీ, ఆ ఫోన్ లోని స్క్రీన్, యాప్స్ బ్యాటరీని ప్రభావితం చేస్తాయి. అపోహ: చార్జింగ్ లో ఉన్నప్పుడు కాల్ స్వీకరిస్తే సెల్ ఫోన్ పేలుతుంది/ వాస్తవం: నిజానికి ఈ తరహా ఘటనలు కొన్ని వెలుగు చూశాయి. ఈ విషయంలో తప్పు బ్యాటరీలదే తప్ప మొత్తం సెల్ ఫోన్లది ఎంతమాత్రమూ కాదు. తక్కువ క్వాలిటీ ఉన్న చార్జర్లు, బ్యాటరీల కారణంగానే ఇలా జరుగుతుంది. 440 ఓల్టుల లైన్ల నుంచి చార్జింగ్ చేస్తుండటం, డీసీ బ్యాటరీలను వాడుతున్నప్పుడు ఈ తరహా ఘటనలు సంభవమే. అయితే, నాణ్యమైన బ్యాటరీలు వాడుతుంటే ఈ సమస్య ఉత్పన్నమే కాదు. అపోహ: మొబైల్ ఫోన్లు రేడియేషన్ విడుదల చేస్తాయి. కాబట్టి వాటిని గుండె తదితర ముఖ్య శరీర భాగాలకు దూరంగా ఉంచాలి. వాస్తవం: ఇది కూడా క్వాలిటీ లేని ఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రతి పేరున్న బ్రాండ్ ఫోనూ ఎస్ఏఆర్ (స్పెసిఫిక్ అబ్ సార్ప్ షన్ రేటింగ్) పరీక్షల తరువాత మార్కెట్లోకి వస్తుంది. ఇవి శరీర భాగాలకు నష్టం కలిగించేంత రేడియేషన్ విడుదల చేయవు. మొబైల్ ఫోన్ల వాడకానికి, రుగ్మతల బారిన పడటానికి సంబంధం ఉన్నట్టు ఇప్పటివరకూ నిరూపితం కాలేదు.

More Telugu News