: మన వాళ్లు 'ఫ్రీ'గా వచ్చే వీడియోలే చూస్తారట!

భారతీయులు 'ఫ్రీ' వీడియోలు చూసేందుకే మొగ్గుచూపుతారని 'వూక్లిప్' చేసిన సర్వేలో వెల్లడైంది. భారత్ లో అత్యధికులు రుసుము వసూలు చేసే ఇతర వెబ్ సైట్ల కంటే 'టొరెంటో' ద్వారా వీడియోలు 'ఫ్రీ'గా డౌన్ లోడ్ చేసుకుని, ఆఫ్ లైన్ లో చూసేందుకు ఇష్టపడతారని 'వూక్లిప్' వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో 52 శాతం మంది పెయిడ్ వీడియోలు చూస్తుండగా, భారత్ లో రుసుము చెల్లించి వీడియోలు వీక్షించేవారు కేవలం 23 శాతం మందేనని ఆ సర్వే తెలిపింది. 56 శాతం మంది 'ఫ్రీ' వీడియోలు డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ ద్వారా చూస్తారని, అలా చూసిన వారిలో మూడొంతుల మంది ఆ వీడియోలను వీక్షించిన రోజునే డిలీట్ చేస్తారని తేలింది. భారత్, మలేసియా, ధాయ్ లాండ్, ఇండోనేషియా, యూఏఈ, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన 4,600 మందిని దీనిపై 'వూక్లిప్' సర్వే చేసినట్టు తెలిపింది.

More Telugu News