: 21వ శతాబ్దం భారత్ దే!... జపాన్ ‘సాఫ్ట్ బ్యాంక్’ సీఈఓ ఉద్ఘాటన

పారిశ్రామిక రంగంలో మెరుగైన వృద్ధితో భారత్ దూసుకెళుతోంది. గడచిన పదేళ్లుగా ఇదే భావన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. తాజాగా ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన ‘మేకిన్ ఇండియా’ ఆ భావనను మరింత పెంచిందనే చెప్పాలి. 21వ శతాబ్దం భారత్ దేనన్న ప్రకటనలు ఆయా దేశాల పారిశ్రామికవేత్తల నుంచి వెల్లువెత్తున్నాయి. తాజాగా జపాన్ టెలికాం, మీడియా దిగ్గజం ‘సాఫ్ట్ బ్యాంక్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మసయోషి సాన్ ఈ మాటను పునరుద్ఘాటించారు. ఇప్పటికే భారత్ లోని అపార వ్యాపారావకాశాలను గుర్తించిన తాము మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని సామ్ చెప్పారు. నేటి ఉదయం ఢిల్లీలో ప్రారంభమైన స్టార్టప్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘‘రానున్న పదేళ్లలో చైనాను దాటేయనున్న భారత్ అగ్రగామిగా అవతరించనుంది. 21వ శతాబ్దం భారత్ దే. ఈ వాస్తవాన్ని గమనించాం. భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నాం’’ అని ఆయన ప్రకటించారు.

More Telugu News